భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 15,968 పాజిటివ్‌ కేసులు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 10:14 AM IST
భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 15,968 పాజిటివ్‌ కేసులు..

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపులతో దేశంలో రోజు రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,968 కొత్త కేసులు నమోదు కాగా.. 465 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. కరోనా వ్యాప్తి దేశంలో మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,56,183కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 14,476 మంది మృత్యువాత పడ్డారు.

మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,58,685 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,83,022 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 4వ స్థానంలో ఉంది. ఇక మరణాలు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో 8వ స్థానంలో ఉంది.

Next Story