ఎన్డీఆర్‌ఎఫ్‌లో కరోనా కలకలం.. 50 మంది జవాన్లకు కరోనా
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2020 8:54 AM GMTజాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన(ఎన్డీఆర్ఎఫ్)లో కరోనా కలకలం రేపుతోంది. ఒడిశాలో ఆంఫన్ తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి కరోనా సోకింది. వీరికి ఒడిశాలో కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తుపాన్ అనంతరం ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. కటక్, భువనేశ్వర్ ప్రాంతాల్లో సహాయ పనులు చేసిన 170 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 50 మందికి పాజిటివ్ అని వచ్చింది.
రక్షణ సమయంలో కరోనా నుంచి తప్పించుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ మహమ్మారి వైరస్ తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంది. దీంతో 50 మందికి ఈ మహమ్మారి భారీన పడ్డారు. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించారు. మిగితా వారిని సెల్ప్ క్వారంటైన్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కాగా తుపాను నుంచి ప్రజలను కాపాడేందుకు 19 బృందాలను కేంద్రం పంపించింది. దీనిపై అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.