ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కరోనా పరీక్షలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2020 6:53 AM GMT
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కరోనా పరీక్షలు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు సమస్యలతో బాధపడుతుండడంతో ముందు జాగ్రత్తగా ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. నేడు కేజ్రీవాల్‌కు డాక్టర్లు కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. ఆయన నుంచి శాంపిల్స్‌ సేకరించి వాటిని ల్యాబ్‌కి పంపారు. 24గంటల లోపు ఫలితాలు రానున్నారు. ఇక రిపోర్టులో పాజిటివ్‌ వస్తుందా లేదా నెగిటివ్‌ వస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

కరోనా వైరస్‌ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. పాజిటివ్‌ కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో 28వేల 936 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 812 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ఇప్పటివరకు 2,66,598 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 7,446 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story