కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

By సుభాష్  Published on  9 Jun 2020 7:11 AM GMT
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవ్వరిని వదలడం లేదు. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వందలాదిగా ఉద్యోగులు పని చేస్తుంటారు. వారిలో ఎవరో ఒకరికి కరోనా సోకినా.. మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. (ఇది చదవండి: తెలంగాణలో దసరా వరకు స్కూళ్లు తెరిచే ప్రసక్తే లేదు.!)

దగ్గు, జలుబు, జ్వరం ఉంటే విధులకు హాజరు కావద్దని సూచించింది. అలాగే కార్యదర్శి స్థాయి అధికారులు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాలని, కంటైన్‌మెంట్‌ జోన్లలోని వాళ్లకు వర్క్‌ ఫ్రం హోం చేయాలని సూచించింది. అయితే ఉద్యోగులకు కరోనా వైరస్‌ సోకుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక తాజాగా భారత్‌లో కరోనా కేసులు 2,66,598కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 9,987 కేసులు నమోదు కాగా, 331 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 7,446కు చేరింది. ఇక ఇప్పటి వరకూ 1,29,917 మంది వైరస్‌ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,29,215 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (ఇది చదవండి: ఇక కరోనా సోకితే ఇలా చేయండి.. కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు)

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతోంది. గత వారం రోజుల్లో 1868 మంది ప్రాణాలు కోల్పోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 5వ స్థానంలో ఉంది. అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. బ్రెజిల్‌, రష్యా, యూకే ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో 12వ స్థానంలో ఉంది.

Next Story