ప్రియుడితో గోవాలో నయన్.. ఫోటోలు వైరల్
By తోట వంశీ కుమార్ Published on 15 Sept 2020 11:55 AM ISTసౌత్‌లో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతోంది నయనతార. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు. కాగా.. నయన్ కొంతకాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమలో ఉంది. ఇక నయన్‌తో కలిసి ఉన్న చిత్రాలను విఘ్నేష్ సోషల్ మీడియాలో తరుచుగా పోస్టు చేస్తుంటాడు. లాక్‌డౌన్ కాలం మొత్తాన్ని నయన్.. విఘ్నేష్ శివన్‌తో కలిసి చెన్నైలో గడిపింది. ఇటీవల జరిగిన ఓనమ్ ఉత్సవాల సందర్భంగా విఘ్నేష్ శివన్‌ను కేరళలోని తన స్వస్థలానికి తీసుకెళ్లింది. సంప్రదాయ దుస్తుల్లో ఈ జంట చేసిన సందడి అందరిని ఆకట్టుకుంది. కాగా.. ప్రస్తుతం ఈ జంట గోవాలో విహరిస్తుంది.
వారితో పాటు విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులు కూడా విహారయాత్రకు వెళ్లారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను విఘ్నేష్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. తాము సెలవుల నుంచి ట్రిప్ ఫీలింగ్‌లోకి వచ్చామన్నాడు. తెలుపు ఎల్లప్పుడూ అద్భుతంగానే ఉంటుందని పేర్కొంటూ.. నయనతార తెలుపు రంగు గౌను ధరించి అక్కడి ప్రాంతాలను చూస్తోన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. తన తల్లి స్విమ్మింగ్‌లో ఎంజాయ్ చేస్తున్న పోటోల్ని ఆయన పంచుకున్నారు. అమ్మ ముఖంలో చిరునవ్వు నేరుగా మన హృదయాల్ని తాకుతుంది. మన తల్లిదండ్రుల సంతోషానికి మించిన సంతృప్తి, ఆనందం మరొకటి ఉండదు. ఓ విధంగా చెప్పాలంటే.. మన జీవిత లక్ష్యమే వారిని సంతోషంగా ఉంచడం అని అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.