బాలయ్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్న పవన్ కళ్యాణ్.. బాలయ్యను బ్రదర్ అన్న నాగబాబు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sep 2020 2:36 PM GMT
బాలయ్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్న పవన్ కళ్యాణ్.. బాలయ్యను బ్రదర్ అన్న నాగబాబు

నందమూరి బాలకృష్ణను బహిరంగంగా పలు మార్లు నాగబాబు విమర్శించిన సంగతి తెలిసిందే..! ఒకానొక సమయంలో తనకు తెలిసిన బాలయ్య వేరు.. మీరనుకుంటున్న బాలయ్య వేరు అంటూ చిన్న పాటి కౌంటర్లు వేశారు. కానీ తాజాగా నాగబాబు పెట్టిన పోస్టులో బాలయ్యను తన సోదరుడు అంటూ చెప్పుకొచ్చారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన అరుదైన పోస్టులను గత కొద్దిరోజులుగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్టు చేస్తూ వస్తున్నారు నాగబాబు. ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి.. నా దగ్గర.. దాచానంతే.. ఫరెవర్‌ బెస్ట్ బ్రదర్‌.. ఫరెవర్‌ లవ్‌.. పవన్‌ కల్యాణ్ అంటూ త‌మ్ముడి ఫోటోను అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

బావగారూ బాగున్నారా సినిమా ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోను కూడా నాగబాబు పోస్టు చేశారు. అందులో పవన్ కళ్యాణ్, నాగబాబు, మెగా స్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఇంతలో తన దగ్గర ఉన్న ఫోటోలను పోస్టు చేయడం ఆపలేదు నాగబాబు.

నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నారు నాగబాబు. అందులో బాలయ్య బాబుకు, పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు. ఇది సుస్వాగతం సినిమా సమయంలో తీసిన ఫోటో అని పవన్ కళ్యాణ్ లుక్ చూడగానే అర్థమవుతోంది. ఈ ఫోటోకు నాగబాబు పెట్టిన క్యాప్షన్ చాలా మందిని ఆకర్షిస్తోంది.

ఇద్దరు బ్రదర్స్ కలిసి వచ్చారు అని నాగబాబు వెల్లడించారు. ఒకరేమో నా బ్రదర్ పవన్ కళ్యాణ్ అని తెలపగా.. ఇంకొకరు బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటూ బాలయ్యను తన సహోదరుడితో పోల్చారు నాగబాబు. అంతేకాదు.. పవర్ స్టార్ నందమూరి సింహాన్ని కలిసిన రోజు అంటూ అరుదైన ఫోటోను పోస్టు చేశారు. ఈ పోస్టు అటు నందమూరి అభిమానులను, ఇటు మెగా అభిమానులను తెగ ఆకర్షిస్తోంది.

Next Story