ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అధికారులు సహా ఐదుగురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు బరశూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని గణేష్‌ బహర్‌ వద్ద అదుపు తప్పి లోకలోకి దూసుకెళ్లినట్లు దంతేవాడ ఎస్పీ అభిషేక్‌ వెల్లడించారు. ఇది మామూలు ప్రమాదమే అయినా.. మావోయిస్టుల కుట్ర దాగి ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. కాగా ఘటన స్థలంలోనే ఐదుగురూ మృతి చెందినట్లు చెప్పారు.

ప్రమాదంలో బీజాపూర్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగం సబ్‌ ఇంజనీర్‌ సురేంద్ర ఠాకూర్‌, క్లర్కులు రామధర్‌ పాండే, అనిల్‌ పర్సూల్‌, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ జవాను సుఖేల్‌ పాండే, కారు డ్రైవర్‌ రాజేష్‌కుమార్‌ లాంబాడీగా గుర్తించారు. జగదల్‌పూర్‌లో అధికారిక కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.