నక్కలు కూడా మోసంతోనే సింహాలను చంపుతాయి.. తండ్రి హత్యపై జీషన్

మహారాష్ట్రలో హై ప్రొఫైల్ బాబా సిద్ధిఖీ హత్య కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

By Medi Samrat  Published on  19 Oct 2024 2:42 PM GMT
నక్కలు కూడా మోసంతోనే సింహాలను చంపుతాయి.. తండ్రి హత్యపై జీషన్

మహారాష్ట్రలో హై ప్రొఫైల్ బాబా సిద్ధిఖీ హత్య కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యకు సంబంధించిన మరో ఐదుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు లారెన్స్ గ్యాంగ్‌కు చెందినవారిగా తేలింది.అయితే పోలీసులు ఇంకా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్ సిద్ధిఖీ శనివారం సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనం సృష్టించింది. జీషన్ సిద్ధిఖీ తన పోస్ట్‌లో.. పిరికివారు తరచుగా ధైర్యవంతులను భయపెడతారు.. నక్కలు కూడా మోసంతో సింహాలను చంపుతాయి అని రాశాడు. ఈ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉండి ఇటీవలే ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిఖీ అక్టోబర్ 12న ముంబైలో కాల్చి చంపడం గమనార్హం. సిద్ధిఖీ కుమారుడు జీషన్ కార్యాలయం వెలుపల ఆయ‌న‌పై కాల్పులు జరిగాయి, అక్కడ ముగ్గురు దుండగులు ఆయ‌న‌పై దాడి చేశారు. అక్కడికక్కడే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

హత్య వెనుక లారెన్స్ గ్యాంగ్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు, అయితే వేరే కార‌ణాలు కూడా ఉండే అవకాశాలను పోలీసులు తోసిపుచ్చడం లేదు. కాగా, బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు స్నాప్‌చాట్ యాప్ ద్వారా పరస్పరం మాట్లాడుకునేవారని వెల్లడైన మరో విషయం వెలుగులోకి వచ్చింది.

Next Story