ప్రముఖ యూట్యూబర్.. సినిమాను ప్రేమించిన 'యాంగ్రీ ర్యాంట్ మ్యాన్' ఇక లేరు

సోషల్ మీడియా యూజర్లకు యాంగ్రీ రాంట్‌మన్‌ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By Medi Samrat
Published on : 17 April 2024 4:11 PM IST

ప్రముఖ యూట్యూబర్.. సినిమాను ప్రేమించిన యాంగ్రీ ర్యాంట్ మ్యాన్ ఇక లేరు

సోషల్ మీడియా యూజర్లకు యాంగ్రీ రాంట్‌మన్‌ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గట్టిగా అరుస్తూ ఎన్నో సినిమాల రివ్యూలు ఇచ్చి బాగా ఫేమస్ అయిన ప్రముఖ యూట్యూబర్ అబ్రదీప్ సాహా ఇక లేరు. ఈ వార్త ఆన్‌లైన్ కమ్యూనిటీలో విషాదాన్ని నింపింది. 27 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఏప్రిల్ 16 రాత్రి అతడు మరణించాడు. ఈ విషయం అతని కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది.

అబ్రదీప్ సాహా తన YouTube ఛానెల్‌ని ఆగస్టు 18, 2017న ప్రారంభించాడు. పలు భాషల సినిమాల రివ్యూలు అరుస్తూ ఇస్తూ ఉండేవాడు. అలాగే ఫుట్ బాల్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇస్తూ ఉండేవాడు. యాంగ్రీ రాంట్‌మాన్ గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో ఉన్నాడు. అతను లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమ్‌తో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడని మూడు రోజుల క్రితం తెలిసింది. ఇంతలో అతడు మరణించాడనే వార్త వచ్చింది. ప్రస్తుతం, అతని YouTube ఛానెల్ 480k సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

Next Story