మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు.. పవార్ గురించి ఫడ్నవీస్ వ్యాఖ్య‌లు

తాను, తన ప్రభుత్వంలోని ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే వారంలో ఏడు రోజులు 24 గంటలూ పని చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం చెప్పారు.

By Medi Samrat  Published on  19 Dec 2024 8:21 PM IST
మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు.. పవార్ గురించి ఫడ్నవీస్ వ్యాఖ్య‌లు

తాను, తన ప్రభుత్వంలోని ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే వారంలో ఏడు రోజులు 24 గంటలూ పని చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం చెప్పారు. నవ్వుతూ.. అజిత్ పవార్ పొద్దున్నే లేచేవారు.. కాబట్టి ఆయ‌న‌ ఉదయాన్నే పని చేస్తారు. నేను మధ్యాహ్నం నుండి అర్ధరాత్రి వరకు డ్యూటీలో ఉంటాను.. రాత్రి ఎవరు ఉంటారో మీకు తెలుసని వ్యాఖ్యానించారు.

నాగ్‌పూర్‌లో జరుగుతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉభయ సభల్లో గవర్నర్ సంయుక్త ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ క్ర‌మంలోనే అజిత్ పవార్ వైపు చూపిస్తూ.. దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో "మిమ్మల్ని 'శాశ్వత ఉప ముఖ్యమంత్రి' అని పిలుస్తారు, కానీ నా శుభాకాంక్షలు మీకు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు" అని అన్నారు.

బీజేపీకి చెందిన 19 మంది, శివసేనకు చెందిన 11 మంది, ఎన్సీపీకి చెందిన 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య 42కి చేరుకుంది. నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలకు ఒక రోజు ముందు ఈ మంత్రివర్గ విస్తరణ జరిగింది.

Next Story