ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

Yogi Adityanath's chopper makes emergency landing in Varanasi after bird hit.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2022 7:01 AM GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్‌ను ప‌క్షి ఢీ కొట్టింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఫైలెట్ హెలికాఫ్ట‌ర్‌ను వార‌ణాసిలో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేశారు. ఆదివారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం సీఎం యోగి ఆదిత్య‌నాథ్ శ‌నివారం వార‌ణాసి వెళ్లారు. అక్క‌డ ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. అనంత‌రం శాంతి భ‌ద్ర‌త‌ల అంశాల‌ను స‌మీక్షించారు. ఈరోజు(ఆదివారం) ఉద‌యం తిరిగి ల‌ఖ్‌న‌వూ వెళ్లేందుకు వార‌ణాసిలోని రిజ‌ర్వు పోలీసు లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాఫ్ట‌ర్‌లో బ‌య‌లుదేరారు. హెలికాఫ్ట‌ర్ టేకాప్ అయిన కాసేప‌టికే ఓ ప‌క్షి ఢీ కొట్టింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పైలెట్ హెలికాప్ట‌ర్ ను అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేశారు.

హెలికాప్టర్ కు సాంకేతిక పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. త‌రువాత‌ సీఎం యోగి సర్క్యూట్ హౌస్ కి వెళ్లారని సమాచారం. అనంత‌రం ఆయ‌న విమానం ద్వారా ల‌ఖ్‌న‌వూ బ‌య‌లుదేరి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు.

Next Story
Share it