మహా కుంభమేళాలో వసంతపంచమి రోజున సోమవారం నాడు అమృత స్నాన్ నిర్వహించనున్నారు. ఆ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎలాంటి తప్పులకు తావుండకూడదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'అఖారాల' సంప్రదాయ 'శోభా యాత్ర'ను వైభవంగా నిర్వహించాలని, అవసరమైన అన్ని సన్నాహాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. భద్రత చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి తెలిపారు. పార్కింగ్ స్థలాన్ని పెంచాలని, భక్తులు వీలైనంత తక్కువగా నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు సీనియర్ పోలీసు అధికారులను నియమించాలన్నారు. ఎటువంటి VIP ప్రోటోకాల్ అమలులో ఉండదని చెప్పారు.