భారత్‌లో 8 వేల 'X' ఖాతాలు బ్లాక్.. కంపెనీ స్పందన ఇదే
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'X' కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik
భారత్‌లో 8 వేల 'X' ఖాతాలు బ్లాక్.. కంపెనీ స్పందన ఇదే
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'X' కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వ కార్య నిర్వాహక ఆదేశాలతో దేశంలోని 8 వేల 'ఎక్స్' అకౌంట్‌ను బ్లాక్ చేసినట్లు ప్రకటించింది. తమ ఆదేశాలను పాటించకపోతే కంపెనీ రీజినల్ ఎంప్లాయిస్‌కు జరిమానా విధించడం సహా నిర్బంధంలోకి తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం చేసిందని..ఎక్స్ పేర్కొంది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన 'ఎక్స్' ఖాతాల నిలిపివేతకు చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ప్రభుత్వం నిలిపివేయాలని కోరిన వాటిలో అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖ ఎక్స్ వినియోగదారుల ఖాతాలు ఉన్నాయని వెల్లడించింది. "చాలా సందర్భాలలో ఒక ఖాతా నుంచి ఏ పోస్టులు భారతదేశ స్థానిక చట్టాలను ఉల్లంఘించాయో ప్రభుత్వం పేర్కొనలేదు. గణనీయమైన సంఖ్యలో ఖాతాలను బ్లాక్ చేయడానికి మాకు ఎటువంటి ఆధారాలు అందలేదు. ప్రభుత్వం డిమాండ్లతో మేము విభేదిస్తున్నాము. మొత్తం ఖాతాలను బ్లాక్ చేయడం అనవసరం మాత్రమే కాదు. ఇది ఇప్పటికే ఉన్న భవిష్యత్తు కంటెంట్ ను సెన్సార్ షిప్ చేయడం లాంటిది." అని ఎక్స్ పేర్కొంది.
"ఈ కార్యనిర్వాహక ఆదేశాలను బహిరంగపరచడం పారదర్శకతకు చాలా అవసరమని మేము విశ్వసిస్తున్నాము. అలాగే ఆదేశాలను బహిర్గతం చేయకపోతే జవాబుదారీతనం దెబ్బతింటుంది. ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తుంది. అయితే, చట్టపరమైన పరిమితుల కారణంగా మేము ఈ సమయంలో కార్యనిర్వాహక ఆదేశాలను వెల్లడించలేకపోతున్నాం. కంపెనీకి అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నాం. మా విధానాలకు
అనుగుణంగా వినియోగదారులకు చర్యల నోటీసును అందించాం. " అని ఎక్స్ తెలిపింది.
కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ల 'ఎక్స్' ఖాతాలపై వేటు వేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లు , న్యూస్, ఎంటర్ టైన్ మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లను కూడా నిలిపివేసింది. మరో వైపు పాకిస్తానీ కంటెంట్ ఉన్న అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా స్ట్రీమింగ్ సేవలు మరియు మధ్యవర్తులు పాకిస్తాన్ నుండి ఉద్భవించే వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు మరియు ఇతర స్ట్రీమింగ్ కంటెంట్‌ను వెంటనే నిలిపివేయాలి" అని కోరింది. సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మోడల్‌ల ద్వారా లేదా ఇతరత్రా అందించబడినా. జాతీయ భద్రత ప్రయోజనాల కోసం" ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్ తెలిపింది.