హిందూ - ముస్లింలను విడదీసే రాజకీయం చేయను: మోదీ

ఒక వేళ తాను హిందూ - ముస్లిం రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ప్రధానిగా పనికిరానని మోదీ అన్నారు.

By అంజి  Published on  15 May 2024 2:45 PM IST
Hindu Muslim, PM Modi, Public Life, National news

హిందూ - ముస్లింలను విడదీసే రాజకీయం చేయను: మోదీ

ఒక వేళ తాను హిందూ - ముస్లిం రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ప్రధానిగా పనికిరానని మంగళవారం నాడు మోదీ అన్నారు. తాను హిందూ - ముస్లింలను విడదీసే రాజకీయం చేయబోనని న్యూస్‌ 18తో మాట్లాడుతూ చెప్పారు. ముస్లింలు ఎక్కువ మంది కంటారని తాను అనలేదని చెప్పారు. ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు. హిందువుల్లోనూ పేదలు ఉంటాటరని, తన వ్యాఖ్యలను ముస్లింలకు మాత్రమే ఆపాదిస్తూ తప్పుడు ప్రచారం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి వారణాసి పర్యటన సందర్భంగా న్యూస్ 18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. హిందూ-ముస్లింలను వేరు చేయకూడదనేది తన సంకల్పమని ప్రధాని మోదీ అన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు వారణాసి నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 1న వారణాసిలో ఆరో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ముస్లింలు తనకు ఓటు వేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రధాని.. ''దేశ ప్రజలు నాకు ఓటేస్తారని నేను నమ్ముతున్నాను. నేను హిందూ-ముస్లింలను వేరు చేయడం ప్రారంభించిన రోజు, నేను ప్రజా జీవితంలో జీవించడానికి సరిపోను. నేను హిందూ-ముస్లిం విభజన చేయను, ఇదే నా సంకల్పం'' అని అన్నారు. “నా మంత్రం 'సబ్కా సాథ్ సబ్కా వికాస్'. నేను ఓటు బ్యాంకు కోసం పని చేయను. ఏదైనా తప్పు జరిగితే, నేను తప్పు అని చెబుతాను, ”అని ప్రధాని అన్నారు.

Next Story