రైలులో దర్జాగా గంజాయి లాగించిన అమ్మాయిలు.. వీడియో నేషనల్ లెవల్ లో వైరల్

Women smoke marijuana inside train. కొంతమంది మహిళలు రైలులో గంజాయి, సిగరెట్లు తాగుతున్న వీడియోను ఒక ప్రయాణికుడు

By M.S.R  Published on  27 Feb 2023 8:30 PM IST
రైలులో దర్జాగా గంజాయి లాగించిన అమ్మాయిలు.. వీడియో నేషనల్ లెవల్ లో వైరల్

కొంతమంది మహిళలు రైలులో గంజాయి, సిగరెట్లు తాగుతున్న వీడియోను ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అసన్‌సోల్‌లో రైలు ఎక్కిన మహిళలు రాత్రి సమయంలో గంజాయి, సిగరెట్లు తాగారని ఆరోపించారు. టాటానగర్ నుండి కతిహార్ రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ట్వీట్‌లో ఫిర్యాదు చేశాడు. “ఈ అమ్మాయిలు రాత్రంతా గంజాయి, సిగరెట్లు తాగుతున్నారు. వారు అసన్సోల్ వద్ద రైలు ఎక్కారు, ”అని అతను ఒక ట్వీట్‌లో వీడియోను పంచుకున్నాడు. అతని ట్వీట్‌పై రైల్వే సేవా స్పందించింది.. ప్రయాణ వివరాలను పంచుకోవాలని కోరింది.

“సర్, దయచేసి ప్రయాణ వివరాలు (PNR/ట్రైన్ నంబర్) మొబైల్ నంబర్‌ను మాతో ముఖ్యంగా షేర్ చేయవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీరు మీ ఆందోళనను నేరుగా http://railmadad.indianrailways.gov.inలో తెలియజేయవచ్చు లేదా సత్వర పరిష్కారం కోసం 139కి డయల్ చేయవచ్చు” అని రైల్వే సేవ ట్వీట్ చేసింది. వైరల్ అవుతున్న వీడియోలో కిక్కిరిసిపోయి ఉన్న రైలులో మహిళా ప్రయాణీకురాలు నిలబడి సిగరెట్ ను లాగిస్తూ ఉండడం గమనించవచ్చు.


Next Story