బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు..!
బస్సుల్లో మహిళలు చితక్కొట్టుకుంటూ ఉన్న ఘటనలు ఇటీవలి కాలంలో మనం చూశాం.
By Medi Samrat Published on 9 Feb 2024 8:45 PM ISTబస్సుల్లో మహిళలు చితక్కొట్టుకుంటూ ఉన్న ఘటనలు ఇటీవలి కాలంలో మనం చూశాం. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందించిన తర్వాత ఈ ఘటనలు చూసాం. ఇక కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటనలే కెమెరాల్లో రికార్డు అవుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 8న బెంగళూరులో రద్దీగా ఉండే బస్సులో ఇద్దరు మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకుంటూ ఉన్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్సులో కిటికీ తెరవడంపై ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైందని ఈ వీడియోను పోస్టు చేసిన రాకేష్ ప్రకాష్ అనే వ్యక్తి తెలిపాడు.
బస్సులో ఉన్న ప్రయాణికులు జోక్యం చేసుకుని గొడవను ఆపాలని భావించారు. గొడవను ఆపడానికి బస్సు కండక్టర్ కూడా వచ్చాడు. గొడవ సద్దుమణిగాక ఇద్దరు మహిళలను బస్సులో నుంచి కిందకు దించేశారు. ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ప్రజలు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకున్నారు.