ఉగ్రవాదుల ఘాతుకం.. జమ్మూకశ్మీర్‌లో ఉపాధ్యాయురాలి కాల్చివేత

Woman Teacher Shot Dead By Terrorists In Jammu and Kashmir's Kulgam.జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2022 2:08 PM IST
ఉగ్రవాదుల ఘాతుకం.. జమ్మూకశ్మీర్‌లో ఉపాధ్యాయురాలి కాల్చివేత

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగ‌బ‌డ్డారు. ఓ ఉపాధ్యాయురాలిపై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్ర‌గాయాలైన ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

వివ‌రాల్లోకి వెళితే.. జమ్ము డివిజన్‌లోని సాంబాకి వలస వచ్చిన రజనీ భల్లా అనే మ‌హిళ‌ కుల్గామ్‌ జిల్లాలోని గోపాల్‌పొరా ప్రాంతంలోని హైస్కూల్ లో ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తోంది. మంగ‌ళ‌వారం ఆమె పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్ర‌గాయాల పాలైన ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెంది. పాఠ‌శాల స‌మీపంలోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఉగ్ర‌వాదుల కోసం సెర్చ్ ఆప‌రేష‌న్‌ను మొద‌లుపెట్టాయి.

కాగా.. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇటీవ‌ల ఉగ్ర‌వాదుల చేతిలో సామాన్య ప్ర‌జ‌లు బ‌ల‌వుతున్న ఘ‌ట‌న‌లు వెలుగుచూస్తున్నాయి. మే 12న బుద్గాం జిల్లాలో రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగి రాహుల్ భ‌ట్ బ‌ల‌య్యారు. గ‌త వారం టీవీ న‌టి అమ్రీన్ భ‌ట్ ఉగ్రమూక‌ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి అవంతిపొరా ప్రాంతంలోని రాజ్‌పొరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Next Story