స్పృహ త‌ప్పిన యువ‌కుడిని భుజాల‌పై మోసుకెళ్లిన మ‌హిళా పోలీసు

Woman police inspector carries unconscious man on her shoulders amid Chennai rain. తమిళనాడులో గత కొద్దిరోజులుగా భారీగా వర్షాలు పడుతున్నాయి. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్న

By అంజి  Published on  11 Nov 2021 4:37 PM IST
స్పృహ త‌ప్పిన యువ‌కుడిని భుజాల‌పై మోసుకెళ్లిన మ‌హిళా పోలీసు

తమిళనాడులో గత కొద్దిరోజులుగా భారీగా వర్షాలు పడుతున్నాయి. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ వ‌ర్షాల‌కు స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెన్నైలో చోటు చేసుకున్న ఓ ఘటన మహిళా శక్తిని ప్రపంచానికి తెలియజేసింది. టీపీ చ‌ట్రం ఏరియాలోని ఓ శ్మ‌శాన వాటిక‌లో ఉద‌య్ కుమార్ అనే యువ‌కుడు స్పృహ త‌ప్పి ప‌డిపోయాడు. అత‌ని శ‌రీరంలో క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించిన మ‌హిళా సీఐ రాజేశ్వ‌రి త‌క్ష‌ణ‌మే ఆస్ప‌త్రికి త‌ర‌లించే ఏర్పాట్లు చేశారు. శ్మ‌శాన వాటిక నుంచి ఆటో వ‌ర‌కు సీఐ రాజేశ్వ‌రి ఉద‌య్ కుమార్‌ను త‌న భుజాల‌పై మోసుకెళ్లారు. ఆ త‌ర్వాత ఆటోలో ఉద‌య్‌ను ఉంచి ఆస్ప‌త్రికి తరలించారు. యువ‌కుడి ప్రాణాల‌ను కాపాడిన సీఐ రాజేశ్వ‌రిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

తమిళనాడు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ జయంత్ మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా శనివారం నుంచి ఇప్పటివరకు 12 మంది మరణించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటుతుందని, చెన్నై నగరం.. అలాగే శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది.

Next Story