మండ్యా పోలీస్‌ స్టేషన్‌: తండ్రికి బదిలీ.. కూతురికి బాధ్యతలు

కర్నాటకలోని మాండ్యాలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ వెంకటేష్.. గత సంవత్సరం

By అంజి
Published on : 22 Jun 2023 11:09 AM IST

Police Sub Inspector,  Karnataka, Mandya Central police station, National news

మండ్యా పోలీస్‌ స్టేషన్‌: తండ్రికి బదిలీ.. కూతురికి బాధ్యతలు

కర్నాటకలోని మాండ్యాలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ వెంకటేష్.. గత సంవత్సరం పీఎస్‌ఐ పరీక్షలో అర్హత సాధించిన తన కుమార్తె వర్షకు తన విధులను అప్పగించారు. తండ్రి నుంచి ఆమె రాజ దండాన్ని, పుష్ప గుచ్చాన్ని స్వీకరించారు. ఈ అరుదైన ఘటనను పోలీస్‌స్టేషన్‌లో అందరూ చూశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తన కుమార్తెకు వెంకటేష్‌ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ అధికార మార్పిడీ తండ్రి-కుమార్తె ద్వయం కోసం ఒక ముఖ్యమైన క్షణంగా గుర్తించబడింది. ఇది ఒక తరం నుండి మరొక తరానికి లాఠీని తరలించడాన్ని హైలైట్ చేసింది.

వెంకటేష్ పదవీ విరమణకు ముందు 16 ఏళ్ల పాటు సైన్యంలో సేవలందించారు. 2010లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పీఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మాండ్యాలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో ఉంటున్నాడు. తన తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ.. వర్ష పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కెరీర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆమె 2022 బ్యాచ్‌లో పీఎస్‌ఐ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. గత ఏడాది కాలంలో ప్రొబేషనరీ పీఎస్‌ఐగా తన శిక్షణను పూర్తి చేసుకుంది. యాదృచ్ఛికంగా వర్ష మండ్యా సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు కేటాయించబడింది. అదే స్టేషన్‌లో ఆమె తండ్రి పనిచేశారు. ప్రస్తుతం వెంటకేష్‌ వేరే దగ్గరికి బదిలీ చేయబడ్డాడు.

Next Story