నాలుగు కాళ్ల ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. మధ్యప్రదేశ్‌లో ఘటన
Woman gives birth to baby girl with ‘four’ legs in Madhyapradesh. మధ్యప్రదేశ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్ జిల్లాలో ఓ మహిళ నాలుగు కాళ్ల కూడిన
By అంజి Published on 16 Dec 2022 7:53 AM GMTమధ్యప్రదేశ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్ జిల్లాలో ఓ మహిళ నాలుగు కాళ్ల కూడిన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన స్థానిక ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. సికందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా బుధవారం.. స్థానికంగా ఉన్న కమల రాజా ఆసుపత్రిలోని మహిళా శిశు వైద్య విభాగంలో పాపకు జన్మనిచ్చింది. పాపకు పుట్టుకతోనే నాలుగు కాళ్లు వచ్చాయి. నవజాత శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిశువు బరువు 2.3 కిలోలు. పుట్టిన తర్వాత, గ్వాలియర్‌లోని జయరోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్‌తో పాటు వైద్యుల బృందం శిశువును పరీక్షించింది.
జయరోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్‌కెఎస్ ధాకడ్ మాట్లాడుతూ.. ''పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయి, ఆమెకు శారీరక వైకల్యం ఉంది. దీనిని వైద్య శాస్త్ర భాషలో ఇస్కియోపాగస్ అంటారు. పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు.. శరీరం రెండు ప్రదేశాలలో అభివృద్ధి చెందుతుంది. ఈ ఆడ శిశువు నడుము కింది భాగం రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందింది, కానీ ఆ కాళ్లు క్రియారహితంగా ఉన్నాయి. ప్రస్తుతం పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్ వైద్యులు.. శిశువు శరీరంలో ఏదైనా ఇతర వైకల్యం ఉందా అని చెక్ చేస్తున్నారు. పరీక్ష తర్వాత, ఆమె ఆరోగ్యంగా ఉంటే, శస్త్రచికిత్స ద్వారా ఆ కాళ్ళను తొలగిస్తారు. తద్వారా ఆమె సాధారణ జీవితాన్ని గడపగలుగుతుంది'' అని చెప్పారు.
శిశువు ప్రస్తుతం కమల రాజా హాస్పిటల్‌లోని పీడియాట్రిక్స్ విభాగంలోని ప్రత్యేక నవజాత సంరక్షణ విభాగంలో చేరింది. శిశువు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శస్త్రచికిత్స ద్వారా ఆమె అదనపు కాళ్లను తొలగించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆడబిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో ఓ మహిళ రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లతో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి చికిత్స అందించిన డాక్టర్ బ్రజేష్ లాహోటి మాట్లాడుతూ.. ''ఈ దంపతులకు ఇది మొదటి సంతానం. ఇంతకుముందు సోనోగ్రఫీ నివేదికలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వెల్లడైంది. ఇది చాలా అరుదైన సందర్భం'' అని చెప్పాడు.
Woman gives birth to baby girl with 'four' legs in MP's Gwalior
— ANI Digital (@ani_digital) December 16, 2022
Read @ANI Story | https://t.co/2GRJXkztGR#GirlWithFourLegs #Gwalior #MadhyaPradesh pic.twitter.com/9CkK423Xnn