'పాకిస్థాన్‌ను హిందూ దేశంగా మారుస్తా'.. ధీరేంద్ర శాస్త్రీ వివాదాస్పద వ్యాఖ్యలు

బాగేశ్వర్ ధామ్ చీఫ్, వివాదాస్పద బోధకుడు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి.. హిందూ దేశం కోసం మరో పిలుపులో భాగంగా గుజరాత్ ప్రజలు ఏకమైతే భారతదేశమే

By అంజి  Published on  29 May 2023 3:15 PM IST
Bageshwar Dham, Dhirendra Shastri, National news, Pakistan

'పాకిస్థాన్‌ను హిందూ దేశంగా మారుస్తా'.. ధీరేంద్ర శాస్త్రీ వివాదాస్పద వ్యాఖ్యలు

బాగేశ్వర్ ధామ్ చీఫ్, వివాదాస్పద బోధకుడు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి.. హిందూ దేశం కోసం మరో పిలుపులో భాగంగా గుజరాత్ ప్రజలు ఏకమైతే భారతదేశమే కాదు, పాకిస్తాన్‌ను కూడా హిందూ దేశంగా మార్చగలనని అన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో బాగేశ్వర్ ధామ్‌కి చెందిన ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ, ''గుజరాత్ ప్రజలు ఇలా ఏకమయ్యే రోజు, భారతదేశాన్నే కాదు, పాకిస్తాన్‌ను కూడా హిందూ దేశంగా మారుస్తాము'' అని అన్నారు. శనివారం (మే 27) సూరత్‌లో జరిగిన భారీ సభను ఉద్దేశించి బాగేశ్వర్ ధామ్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. శాస్త్రి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి వై-కేటగిరీ భద్రతను పొందారు. బగేశ్వర్ ధామ్ చీఫ్ బుధవారం (మే 24) మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి వై-కేటగిరీ భద్రతను పొందారు. ధీరేంద్ర శాస్త్రి ఇటీవలి కార్యక్రమాలకు జనం భారీగా తరలివస్తున్న నేపథ్యంలో భద్రత కల్పించారు. ధీరేంద్ర శాస్త్రి కార్యక్రమాలు తమ రాష్ట్రంలో నిర్వహిస్తే ఆయనకు అదే స్థాయిలో భద్రత కల్పించాలని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఎంపీ ప్రభుత్వం కోరింది.

Next Story