త్వరలోనే పెళ్లి చేసుకుంటా: రాహుల్‌ గాంధీ

తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వెల్లడించారు. అభిమానులు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా ఆయనపై త్వరలో అంటూ స్పందించారు.

By అంజి  Published on  13 May 2024 6:00 PM IST
marriage, Congress, Rahul Gandhi, Raebareli

త్వరలోనే పెళ్లి చేసుకుంటా: రాహుల్‌ గాంధీ

తన నామినేషన్ తర్వాత మొదటిసారిగా రాయ్‌బరేలీ పార్లమెంటరీ నియోజకవర్గంలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మే 13న తనకు తెలిసిన ప్రశ్నను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వెల్లడించారు. రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా ఆయనపై త్వరలో అంటూ స్పందించారు.

కాగా 53 ఏళ్ల రాహుల్‌ గాంధీ పెళ్లి గురించి ఆయన తల్లి సోనియా గాంధీని ఓ అభిమాని అడగగా 'మీరే ఓ మంచి పిల్లను చూడండి' అని అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత ఏడాది జైపూర్‌లోని మహారాణి కాలేజీలో మహిళా విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్‌లో కాంగ్రెస్ ఎంపీ తాను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో వెల్లడించారు. స్మార్ట్‌గా, అందంగా కనిపించినప్పటికీ పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేదని ఓ విద్యార్థి అడిగాడు. రాహుల్‌ గాంధీ స్పందిస్తూ, తాను తన పనికి, కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అంకితభావంతో ఉన్నానని, పెళ్లి గురించి ఆలోచించలేదని చెప్పారు.

Next Story