అప్రూవ‌ర్‌గా మారుతా.. సుకేష్ చంద్రశేఖర్ సంచ‌ల‌నం

ఆర్ధిక నేర‌గాడు సుకేష్ చంద్రశేఖర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్, అతని బృందాన్ని బాగోతాన్ని బట్టబయలు

By Medi Samrat  Published on  23 March 2024 9:36 AM GMT
అప్రూవ‌ర్‌గా మారుతా.. సుకేష్ చంద్రశేఖర్ సంచ‌ల‌నం

ఆర్ధిక నేర‌గాడు సుకేష్ చంద్రశేఖర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్, అతని బృందం బాగోతాన్ని బట్టబయలు చేస్తాన‌ని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. సుకేష్ మాట్లాడుతూ.. నేను ఆయ‌న పాత్ర‌ను బయటపెడతాను. కేజ్రీవాల్, ఆయ‌న‌ బృందానికి వ్యతిరేకంగా నేను అప్రూవ‌ర్‌గా మారుతా.. శిక్ష పడేలా చూస్తానని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సుకేష్ అన్నారు. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుంది.

ఇదిలావుంటే.. మద్యం పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టు మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపింది.

కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత దుండగుడు సుఖేష్ చంద్రశేఖర్ ఆయనకు లేఖ రాశాడు. తీహార్ జైలులోని క్లబ్‌కు నేను అతనిని (కేజ్రీవాల్) స్వాగతిస్తున్నాను అని సుకేష్ వ్యంగ్యం ప్ర‌ద‌ర్శించాడు. సుకేష్ లేఖలో.. ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది. నా ప్రియమైన అరవింద్ కేజ్రీవాల్.. ముందుగా నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. మీరు తీహార్ క్లబ్‌కి 'బాస్'. ముగ్గురు సోదరులు ఇప్పుడు తీహార్ క్లబ్‌ను నడుపుతున్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. నవ భారత శక్తికి ఇదో అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నాడు. మీరు, మీ సోదరులు ఢిల్లీ ప్రజలను మోసం చేశారు. నీ అవినీతికి, చేష్టలకు రాముడు నిన్ను శిక్షించాడు. పైవాడు అన్నీ చూస్తాడని లేఖ‌లో పేర్కొన్నాడు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది. అంతకుముందు ఈడీ కేజ్రీవాల్‌కు తొమ్మిది సార్లు సమన్లు ​​పంపింది. వాటికి బ‌దులుగా ఒక్కసారి కూడా ఆయ‌న ఈడీ ముందు హాజరు కాలేదు.

Next Story