Jharkhand: రాష్ట్రంలో జంగ్లీ ఏనుగుల దాడి..ఏడుగురు మృతి

జార్ఖండ్ రాష్ట్రంలో జంగ్లీ ఏనుగుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే రాత్రిలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు.

By -  Knakam Karthik
Published on : 8 Jan 2026 8:30 AM IST

National News,  Jharkhand, Wild Elephant Attacks, Seven Died

Jharkhand: రాష్ట్రంలో జంగ్లీ ఏనుగుల దాడి..ఏడుగురు మృతి

జార్ఖండ్ రాష్ట్రంలో జంగ్లీ ఏనుగుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే రాత్రిలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కలిపి ఇప్పటివరకు 17 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. తాజా ఘటన నోవాముండి ప్రఖండ్‌లోని జెటేయా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బబారియా గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో గ్రామంలోకి చొరబడిన జంగ్లీ ఏనుగు ప్రజలపై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఇళ్లలో నిద్రిస్తున్న వారిపై ఏనుగు దాడి చేయడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది.

ఈ సంఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఏనుగుల గుంపు ఇంకా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోందని సమాచారం. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని, అలాగే ఏనుగుల నుంచి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జార్ఖండ్‌లో మానవ–అరణ్య జంతు ఘర్షణలు రోజురోజుకు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Next Story