ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్, ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడిని స్వాగతించారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న వారికి తగిన సమాధానమని అభివర్ణించారు.
భారత దళాలు, మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులకు, వారి వెనక ఉన్న వారికి బలమైన సందేశాన్ని పంపాయని హిమాన్షి అన్నారు. తాను అనుభవించిన బాధ, 26 కుటుంబాలు అనుభవించిన బాధ, ఇప్పుడు సరిహద్దు అవతలి వారికి తెలిసిందని చెప్పారు. పహల్గామ్ దాడి జరిగిన రోజును గుర్తుచేసుకుంటూ, ఆరోజు తన భర్తను విడిచిపెట్టమని తాను వేడుకున్నానని హిమాన్షి చెప్పారు. నా పెళ్లి జరిగి ఆరు రోజులే అయింది అని నేను వారికి చెప్పాను. నేను వారిని కరుణించమని అడిగాను. కానీ ఉగ్రవాదులు 'మోదీకి వెళ్లి చెప్పు' అని బదులిచ్చారు. ఈ రోజు, ప్రధాని మోదీ, భారత సైన్యం వారికి సమాధానం ఇచ్చాయని హిమన్షి అన్నారు.