ఆస్పత్రిలో భార్యను దోమలు కుడుతున్నాయని భర్త ట్వీట్.. పోలీసులు ఏం చేశారంటే?
''ఆస్పత్రిలో నా భార్యను దోమలు కుడుతున్నాయి.. దయచేసి సహాయం చేయండి'' అంటూ ఓ వ్యక్తి ట్విటర్ వేదికగా పోలీసులను
By అంజి Published on 22 March 2023 8:45 AM GMTఆస్పత్రిలో భార్యను దోమలు కుడుతున్నాయని భర్త ట్వీట్.. పోలీసులు ఏం చేశారంటే?
''ఆస్పత్రిలో నా భార్యను దోమలు కుడుతున్నాయి.. దయచేసి సహాయం చేయండి'' అంటూ ఓ వ్యక్తి ట్విటర్ వేదికగా పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే స్పందించని పోలీసులు.. ఆస్పత్రికి మస్కిటో కాయిల్స్‌ని తీసుకెళ్లి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని చాందౌసిలో ఈ ఘటన జరిగింది. పురుటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను అసద్ ఖాన్ అనే వ్యక్తి.. హరి ప్రకాశ్ నర్సింగ్ హోంకు తీసుకెళ్లాడు. నిన్న తెల్లవారుజామున ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రిలో దోమలు విపరీతంగా కుడుతుండటంతో.. మహిళ చాలా ఇబ్బంది పడింది. భార్య బాధను చూసి తట్టుకోలేకపోయిన భర్త.. ఎలాగైన ఈ సమస్య నుంచి ఆమెను బయటపడేసేందుకు ప్రయత్నించాడు. తెల్లవారుజామున ఎక్కడా దోమల మందు, మస్కిటో కాయిల్స్ దొరకకపోవడంతో.. చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
ఆమె బాధను చూసిన వ్యక్తి యూపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ''నా భార్య చందౌసిలోని హరి ప్రకాష్ నర్సింగ్ హోమ్‌లో పాపకు జన్మనిచ్చింది. నా భార్య నొప్పితో బాధపడుతోంది. దానితో పాటు ఇక్కడ చాలా దోమలు ఆమెను కుడుతున్నాయి. దయచేసి నాకు వెంటనే మోర్టిన్ కాయిల్ అందించండి'' అంటూ ట్వీట్ చేశాడు. పోలీసు హెడ్‌క్వార్టర్స్ నుండి ఆదేశాలు అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలో దోమల నిరోధక కాయిల్‌తో ఆసుపత్రికి చేరుకున్నారు. చందౌసిలోని రాజ్ మొహల్లా నివాసి అసద్ తనకు సహాయం చేసినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. యూపీ పోలీసులు చేసిన సాయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తెలిసిన వారందరు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అసద్ మాట్లాడుతూ.. ''నా భార్య మా బిడ్డను ప్రసవించడానికి ఆసుపత్రిలో ఉంది. భరించలేని బాధతో పాటు దోమలు కూడా ఆమెను కుడుతున్నాయి. తెల్లవారుజామున 2.45 అయ్యింది, యూపీ పోలీసులను తప్ప మరెవరి సహాయం కోసం నేను ఆలోచించలేకపోయాను. నా ట్వీట్ చేసిన వెంటనే అవతలి వైపు నుండి నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల్లోనే దోమల నివారణ కాయిల్‌ను అందుబాటులోకి తెచ్చారు. సహాయం చేసినందుకు యూపీ పోలీసులు, సంభాల్ పోలీసులు, 112 పోలీసులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను''
‘माफिया से लेकर मच्छर तक का निदान’ - नर्सिंग होम में अपने नवजात शिशु और प्रसूता पत्नी को मच्छरों से राहत देने के लिये एक व्यक्ति द्वारा ट्वीट कर मदद की अपील की गयी। #UP112 PRV 3955 ने त्वरित कार्यवाही कर नर्सिंग होम में मॉस्किटो क्वॉइल पहुँचाया।#UPPCares@sambhalpolice pic.twitter.com/WTrK7o8bhY
— UP POLICE (@Uppolice) March 20, 2023