రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని హాస్పిటాలిటీ సంస్థ 'OYO రూమ్స్' వివాదంలో ఇరుక్కుంది. ఆ సంస్థ ఇచ్చిన ప్రకటన ఒకటి మతపరమైన టర్న్ తీసుకుంది. ఒక హిందీ వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఓయో విడుదల చేసిన ప్రకటనలో "భగవాన్ హర్ జగహ్ హై" అనే ట్యాగ్‌లైన్ ఉంది. దీనికి అనువాదం "దేవుడు ప్రతిచోటా ఉన్నాడు." దీనికి నేరుగా దిగువన "ఔర్ ఓయో భీ" అని ఉంది. అంటే భగవంతుడు ఎక్కడెక్కడ అయితే ఉన్నాడో.. అక్కడ ఓయో కూడా ఉందన్నది ఆ ప్రకటన సారాంశం. అయితే ఈ ప్రకటన ద్వారా హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారంటూ సోషల్ మీడియాలో బాయ్ కాట్ ఓయో అంటూ ట్రెండ్ నడుస్తూ ఉంది.