కర్ణాటక ఎన్నికలలో బిజెపి అభ్యర్థుల జాబితాలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేర్చకపోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. "భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ మార్పును నమ్ముతుంది" అని అన్నారు. మే 10న ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మార్పు తక్కువ అని అన్నారు. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ టిక్కెట్ దక్కకపోవడంతో ప్రముఖ నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో హోంమంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. మాజీ సీఎం జగదీశ్ శెట్టార్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదిలకు టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.
అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. “జగదీశ్ శెట్టార్ తమతో జతకట్టడం వల్ల ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తే.. ఒంటరిగా గెలవలేమని వారు అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరింది కేవలం శెట్టార్, మా ఓటు బ్యాంకు కాదు. మా పార్టీ కార్యకర్తలు కాదు. బీజేపీ చెక్కుచెదరలేదు. మేము భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తామన్నారు.
ఎన్నికల సమయంలో అభ్యర్థుల జాబితా నుండి కొంతమంది నేతలను ఎందుకు తొలగించారని అడగగా.. అమిత్ షా బదులిస్తూ.. “పార్టీ చాలా అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. తొలగించిన వారు కళంకితులేమీ కాదు. మా పార్టీ నాయకులందరూ గౌరవప్రదమైనవారే.. వారికి టిక్కెట్లు ఎందుకు నిరాకరించారనే దాని గురించి మేము కూడా మాట్లాడామని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయం వెనుక యువ రక్తం రావాలి, మార్పు వంటి కొన్ని అంశాలు ఉన్నాయని.. పార్టీ నాయకులు "కళంకితుల" అని ఊహాగానాలు చేయవద్దని ఆయన అన్నారు.