ఎన్నికల్లో గెలిచినా సంతోషంగా లేను : డీకే శివకుమార్

Why DK Shivakumar 'is not happy' despite Congress's thumping victory in Karnataka. కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే.

By Medi Samrat  Published on  21 May 2023 10:44 AM GMT
ఎన్నికల్లో గెలిచినా సంతోషంగా లేను : డీకే శివకుమార్

కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. డీకే శివకుమార్ ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత కూడా తాను సంతోషంగా లేనని అన్నారు. బెంగళూరులో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి శివకుమార్ మాట్లాడుతూ.. “అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 135 కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, కానీ నేను సంతోషంగా లేనని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలే తన తదుపరి లక్ష్యమని శివకుమార్ చెప్పారు. మా తదుపరి లక్ష్యం లోక్‌సభ ఎన్నికలేనని, మరింత మెరుగ్గా పోరాడాలని అన్నారు.

అంతకుముందు బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, శివకుమార్‌తో కలిసి నివాళులర్పించారు. అనంత‌రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తీవ్రవాదం గురించి మాట్లాడుతున్నారని.. అయితే ఉగ్రవాదం వల్ల ఏ బీజేపీ నాయకుడైనా ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పగలరా అని సిద్ధరామయ్య అన్నారు. కాంగ్రెస్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని బీజేపీ అంటోంది.. కానీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతలు తీవ్రవాద దాడుల్లో చనిపోయారన్నారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. ‘‘పాపా, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు, జ్ఞాపకాల్లో స్ఫూర్తిగా ఉంటావు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీకి సంబంధించిన వివిధ క్షణాల వీడియోను పంచుకుంటూ రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. 1991లో ఈ రోజున తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) ఆత్మాహుతి బాంబర్‌తో హత్య చేశారు.


Next Story