ఆ ఐదుగురిలో ఛత్తీస్‌గఢ్‌కు కాబోయే సీఎం ఎవరు..?
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో 54 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.
By Medi Samrat Published on 6 Dec 2023 9:18 AM GMTఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో 54 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 2018లో 68 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ కేవలం 35 సీట్లకు పడిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ సీఎం అభ్యర్ధి ప్రస్తావన లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సీఎం రేసులో మాజీ సీఎం రమణ్‌సింగ్‌తో సహా పలువురు పెద్ద ముఖాలు ఉన్నాయి. మరి పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది చూడాలి.
ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా మూడుసార్లు సీఎంగా ఉన్న రమణ్‌సింగ్.. ఆ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి తీవ్రమైన కృషి చేశారు. రమణ్ సింగ్ రాష్ట్రానికి 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిని బీజేపీ ప్రకటించలేదు. అనేక బహిరంగ సభల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ స్వయంగా కమలదళమే బీజేపీ ముఖమని ప్రజలకు చెప్పారు.
భారత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రేణుకా సింగ్ గిరిజన సంఘం నుండి వచ్చారు. పార్టీ ఆమెను భరత్‌పూర్ సోన్‌హాట్ స్థానం నుంచి పోటీకి దింపింది. రేణుకా సింగ్ కాంగ్రెస్‌కు చెందిన గులాబ్ కమ్రోను ఓడించింది. 2003లో తొలిసారిగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఛత్తీస్‌గఢ్ బీజేపీ సీనియర్ నేత బ్రిజ్‌మోహన్ అగర్వాల్ కూడా సీఎం రేసులో ఉన్నారు. రాయ్‌పూర్ సౌత్ స్థానం నుంచి బ్రిజ్‌మోహన్ అగర్వాల్ 8వ సారి విజయం సాధించారు. రమణ్ సింగ్ ప్రభుత్వంలో బ్రిజ్మోహన్ అగర్వాల్ కూడా మంత్రిగా ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. డాక్టర్ రమణ్ సింగ్ కు అవకాశం రాకపోతే అరుణ్ సావోను సీఎం చేయవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం అరుణ్ సావో బిలాస్‌పూర్ ఎంపీగా ఉన్నారు. సావ్ లోర్మీ స్థానం నుంచి ఎన్నికల్లో విజయం సాధించారు. అరుణ్ సావో OBC కమ్యూనిటీకి చెందిన సాహు కమ్యూనిటీ నుండి వచ్చారు.
లతా ఉసేండి రాష్ట్రంలో బీజేపీకి చెందిన పెద్ద గిరిజన నాయకురాలు. 2003లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఉసెండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. రెండుసార్లు ఓటమి చవిచూశారు. ఉసెండి భారతీయ జనతా యువమోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. సీఎం రేసులో ఆమె పేరు కూడా వినపడుతుంది.