జమ్మూకి చెందిన ప్రముఖ రేడియో జాకీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ గురుగ్రామ్‌లోని ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. 25 ఏళ్ల ఆమెను అభిమానులు "RJ సిమ్రాన్" "జమ్మూ కి ధడ్కన్" అని పిలుస్తారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె విగతజీవిగా పడి ఉండడంతో స్నేహితురాలు గుర్తించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.
సిమ్రాన్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 7 లక్షల మంది ఫాలోవర్లతో మంచి పాపులారిటీని దక్కించుకున్న ఫ్రీలాన్స్ రేడియో జాకీ. ఆమె చివరి పోస్ట్, డిసెంబర్ 13న ఓ రీల్ చేసింది. సిమ్రాన్ సింగ్‌కు ప్రయాణమంటే ఎంతో ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే అది స్పష్టంగా తెలుస్తుంది. సెప్టెంబరులో, ఆమె థాయ్‌లాండ్‌ను సందర్శించింది.