నీట్‌-యూజీ.. మళ్లీ పరీక్ష నిర్వహించడం సబబు కాదు : సుప్రీం

24 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్‌-యూజీ వైద్య పరీక్షకు రీ-ఎగ్జామ్ ఉండదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది

By Medi Samrat  Published on  23 July 2024 8:00 PM IST
నీట్‌-యూజీ.. మళ్లీ పరీక్ష నిర్వహించడం సబబు కాదు : సుప్రీం

24 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్‌-యూజీ వైద్య పరీక్షకు రీ-ఎగ్జామ్ ఉండదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు పిటిషనర్లు రీటెస్ట్‌ను కోరారు. కానీ సుప్రీం కోర్టు రీటెస్ట్ కు నో చెప్పింది. ప్రస్తుత సంవత్సరానికి తాజా నీట్ UGని నిర్దేశించడం.. ఈ పరీక్షకు హాజరైన 24 లక్షల మంది విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కోర్టు గ్రహించింది. ఇది అడ్మిషన్ షెడ్యూల్‌కు అంతరాయం కలిగిస్తుందని.. వైద్య విద్య కోర్సుపై క్యాస్కేడింగ్ ప్రభావాలను కలిగిస్తుందని అభిప్రాయపడింది. ఇది భవిష్యత్తులో అర్హత కలిగిన వైద్య నిపుణుల లభ్యతపై కూడా ప్రభావం చూపుతుందని.. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించిన అట్టడుగు వర్గాలకు తీవ్రంగా ప్రతికూలంగా ఉండవచ్చని అత్యున్నత ధర్మాసనం తెలిపింది.

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని.. బీహార్ లోని హజారీబాగ్, పాట్నాలోనూ పేపర్ లీకైందని సుప్రీం తెలిపింది. 150 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ తో లబ్ధి పొందారని సీజేఐ బెంచ్ వెల్లడించింది. దేశమంతా నీట్ పేపర్ లీకైనట్టు ఆధారాలు లేవని, అందువల్ల నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. లీక్ తో లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది.

Next Story