పశ్చిమ బెంగాల్ కేబినెట్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సాధన్ పాండే ఆదివారం ఉదయం ముంబైలో కన్నుమూశారు. టిఎంసి నేత మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఆమె ట్వీట్ చేస్తూ.. "మా సీనియర్ సహోద్యోగి, పార్టీ నాయకుడు, క్యాబినెట్ మంత్రి సాధన్ పాండే ఈ రోజు ఉదయం ముంబైలో మరణించారు. చాలా కాలంగా అతనితో తమకు అద్భుతమైన సంబంధం ఉంది. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గత సంవత్సరం 71 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సాధన్ పాండే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు.
గత కొన్ని నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ పాండే ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల వెంటిలేషన్‌పై ఉంచారు. ఆయన భౌతికకాయాన్ని తీసుకురావడానికి రాష్ట్ర మంత్రులు సుజిత్ బోస్, శశి పంజా ముంబయి వెళ్లనున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న పాండే 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2011లో పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుండి అతను వినియోగదారుల వ్యవహారాలు, స్వయం సహాయక బృందాలు, స్వయం ఉపాధి శాఖలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.