గులాబ్ జామ్ కోసం.. పెళ్లి విందులో అతిథులు, క్యాటరర్ల గొడవ
పూణేలో జరిగిన ఒక వివాహ విందులో మిగిలిపోయిన గులాబ్ జామూన్‌ను ఇంటికి తీసుకెళ్లడంపై క్యాటరర్లు, బంధువుల మధ్య వివాదం
By అంజి Published on 28 April 2023 2:00 AM GMTగులాబ్ జామ్ కోసం.. పెళ్లి విందులో అతిథులు, క్యాటరర్ల గొడవ
పూణేలో జరిగిన ఒక వివాహ విందులో మిగిలిపోయిన గులాబ్ జామూన్‌ను ఇంటికి తీసుకెళ్లడంపై క్యాటరర్లు, బంధువుల మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవ చివరకు పోలీసు ఫిర్యాదుతో ముగిసింది. ఈ సంఘటన ఏప్రిల్ 23న షెవాలేవాడిలోని రాజ్‌యోగ్ మంగళ్ కార్యాలయంలో జరిగింది. ఈవెంట్ మేనేజర్ దీపాంశు గుప్తా హడప్సర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. లోఖండే, కంబాలే కుటుంబాలకు ఆదివారం వివాహ వేడుక జరగగా, హాలును సంజయ్ లోఖండే బుక్ చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులకు ఆహారం కోసం క్యాటరర్‌ను నియమించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు వివాహ వేడుక జరిగింది. అతిథులు అప్పటికే భోజనం చేసి వెళ్లిపోయారు.
ఇంతలో ఒక బంధువు ఆహారం ఎంత మిగిలిందో తనిఖీ చేయడానికి వెళ్లి, మిగిలిపోయిన వాటిని ఇంటికి తీసుకెళ్తామని చెప్పాడు. ఫిర్యాదుదారు దీపాంశు గుప్తా.. చాలా ఆహారం మిగిలి ఉన్నందున, అతను వాటిని ఇంటికి తీసుకెళ్లడానికి అనుమతించాడు. అయితే పెళ్లి బృందంలోని బంధువులు అక్కడే ఉన్న గులాబ్ జామూన్‌లను పెట్టెలో నింపడం ప్రారంభించారు. ఇంతలొ గులాబ్ జామూన్‌లు మీ కోసం (పెళ్లి వారి) కాదని, బదులుగా మరుసటి రోజు జరగాల్సిన మరో పెళ్లికి సిద్ధమయ్యామని దీపాన్షు వారికి తెలియజేశాడు. దీంతో వాగ్వాదం జరగడంతో కొందరు వ్యక్తులు మేనేజర్‌ను కొట్టారు. దీంతో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.