పీఓకేని వెనక్కి తీసుకుంటాం: అమిత్ షా

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) భారతదేశంలో భాగమని, దానిని వెనక్కి తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

By అంజి  Published on  12 May 2024 9:36 AM GMT
Amit Shah, Pakistan Occupied Kashmir, BJP, Congress,  Kaushambi

పీఓకేని వెనక్కి తీసుకుంటాం: అమిత్ షా

పాకిస్తాన్‌ను మనం గౌరవించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) భారతదేశంలో భాగమని, దానిని వెనక్కి తీసుకుంటామని అన్నారు. ఆదివారం కౌశాంబిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్‌ షా మాట్లాడుతూ.. ''పీఓకేని వెనక్కి తీసుకోకూడదా? కాశ్మీర్‌ను కాంగ్రెస్ కొన్నేళ్లుగా అక్రమ సంతానంలా ఉంచింది, కానీ మేము ఆర్టికల్ 370ని రద్దు చేశాము, అక్కడ ఉగ్రవాదాన్ని అంతం చేశాము. మన సరిహద్దులను కాపాడుకున్నాము. కాశ్మీర్ కోసం ఒక బిడ్డ కూడా సంతోషంగా తన ప్రాణాలను అర్పిస్తాడు'' అని అన్నారు. ఓటు బ్యాంకు బుజ్జగింపు కోసం కాంగ్రెస్, ఎస్పీలను దూషించిన అమిత్ షా.. ఈ పార్టీలు రామమందిరాన్ని 70 ఏళ్ల పాటు జాప్యం చేశాయని అన్నారు.

''మేము వారిని ఆలయ ప్రారంభానికి ఆహ్వానించాము, కానీ వారి ఓటు బ్యాంకు కారణంగా వారు రాలేదు'' అని ఆయన అన్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే వారి ప్రధాని ఎవరని హోంమంత్రి ప్రజలను అడిగారు. ''అది శరద్ పవార్, మమతా, ఉద్ధవ్, స్టాలిన్ లేదా -- నవ్వవద్దు -- రాహుల్ బాబా? కరోనా తిరిగి వస్తే, ప్రజలను ఎవరు కాపాడతారు? 130 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయించింది నరేంద్ర మోదీయే. టీకా వేయడం ప్రారంభించినప్పుడు, ఇది మోడీ వ్యాక్సిన్ అని అఖిలేష్ యాదవ్ చెప్పారు, అయితే ఆ తర్వాత తాను టీకాలు వేసుకోవడానికి నిశ్శబ్దంగా రాత్రి చీకటిలో తన భార్యతో కలిసి వెళ్లాడు'' అని అమిత్‌ షా చెప్పారు.

ఎస్పీ హయాంలో ల్యాండ్ మాఫియా చురుగ్గా ఉందని, అయితే యోగి ఆదిత్యనాథ్ మాఫియాను రాష్ట్రం నుంచి తిప్పికొట్టారని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను అవమానించేదని, అయితే అంబేద్కర్‌తో సంబంధం ఉన్న అన్ని ప్రదేశాలను పునరుద్ధరించాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.

Next Story