మొబైల్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఎయిర్‌టెల్‌ బాటలోనే వొడాఫోన్‌ ఐడియా.!

Vodafone Idea hikes mobile call data rates. భారత్‌లో త్వరలో మొబైల్‌ వినియోగదారుల ఫోన్‌ బిల్లులు మోత మోగనున్నాయి. ఇప్పటికే ప్రీపెయిడ్‌ ఛార్జీలను పెంచుతూ భారతీ ఎయిర్‌టెల్‌ టెలికాం కంపెనీ నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on  23 Nov 2021 9:38 AM GMT
మొబైల్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఎయిర్‌టెల్‌ బాటలోనే వొడాఫోన్‌ ఐడియా.!

భారత్‌లో త్వరలో మొబైల్‌ వినియోగదారుల ఫోన్‌ బిల్లులు మోత మోగనున్నాయి. ఇప్పటికే ప్రీపెయిడ్‌ ఛార్జీలను పెంచుతూ భారతీ ఎయిర్‌టెల్‌ టెలికాం కంపెనీ నిర్ణయం తీసుకుంది. తాజాగా వోడాఫోన్‌ ఇడియా కూడా ఎయిర్‌టెల్‌ బాటలోనే నడవాలని నిర్ణయించుకుంది. దీంతో మొబైల్‌ వినియోగదారులపై అదనపు భారం పడనుంది. డేటా, కాల్‌ వంటి ప్లాన్స్‌పై చార్జీలను 20 నుంచి 25 శాతం పెంచుతున్నట్లు వోడాఫోన్‌ ఐడియా కంపెనీ ప్రకటించింది. పెరిగిన చార్జీలు నవంబర్‌ 25 నుండి అమల్లోకి రానున్నాయి. లిమిటెడ్‌ కేటగిరీ ప్లాన్‌ల ధరలను 20 నుండి 23 శాతం పెంచగా, ప్రారంభస్థాయి ప్లాన్‌లను ధరలను 25 శాతం పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది.

ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలోనే సగటు ఆదాయాన్ని వినియోగదారుపై పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. తాజాగా మారిన వొడాఫోన్‌ ఐడియా ప్రీపెయిడ్‌ రిఛార్జ్‌లకు సంబంధించి.. 28 రోజుల గడువుతో రూ.79గా ఉన్న ప్లాన్‌ ఇకపై రూ.99గా మారనుంది. అలాగే రూ.149 రీఛార్జ్‌ ప్లాన్‌.. రూ.179గా కానుంది. డేటా టాప్‌అప్స్‌ను రూ.48 నుండి రూ.58, రూ.98 నుండి రూ.118కి పెంచారు. అలాగే 28 రోజుల గడువతో రోజుకు 1 జీబీ డేటా అందించే రూ.219 ప్లాన్‌ రూ.269గా ఉండనుంది. రూ.599తో రీచార్జీ చేసే ప్లాన్‌ రూ.719 కానుంది. సంవత్సరం గడువుతో రూ.2,399 డేటా ప్లాన్‌ను రూ.2,899కి పెంచుతూ వొడాఫోన్‌ ఐడియా నిర్ణయం తీసుకుంది.

Next Story