వీఎల్‍సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం ఎత్తేసిన కేంద్రం

VLC Media Player's website no longer banned in India. వీఎల్‍సీ మీడియా ప్లేయర్‌పై బ్యాన్‌ ఎత్తేశారు. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్‌సైట్‌పై నిషేధాన్ని కేంద్ర

By అంజి  Published on  15 Nov 2022 5:36 AM GMT
వీఎల్‍సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం ఎత్తేసిన కేంద్రం

వీఎల్‍సీ మీడియా ప్లేయర్‌పై బ్యాన్‌ ఎత్తేశారు. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్‌సైట్‌పై నిషేధాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖ ఎత్తివేసినట్లు ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఐఎఫ్‌ఎఫ్‌ ట్వీట్‌ చేసింది. ఇప్పటికీ వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ వెబ్‌సైట్‌ లాగిన్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న, లేక యాక్సెస్ చేయలేని వారు ఉన్న వెంటనే ఐఎస్‌పీ వివరాలతో తమను సంప్రదించొచ్చు అని పేర్కొంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వివరాలను తమకు సమర్పించాలని యూజర్లను కోరింది. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ పై నిషేధం ఈ సంవత్సరం ప్రారంభంలో అమలులోకి వచ్చింది.

అయితే ఎందుకు నిషేధాన్ని ప్రకటించారనే దానిపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిషేధం విధించిన తర్వాత వీఎల్‍సీ మీడియా ప్లేయర్ కు ఐఎఫ్‌ఎఫ్‌ న్యాయ సహాయం అందించింది. భారత్‌లో బ్యాన్ అయిన ఓ యాప్‌కు ఈ వెబ్‍సైట్‍తో లింక్ ఉందని, దీని కారణంగానే నిషేధానికి గురైందని రిపోర్టుల్లో తెలిసింది. వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ వెబ్‌సైట్‌ను బ్యాన్‌ చేయాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించగా.. ఆ వెంటనే ఐటీ శాఖ దీన్ని బ్లాక్‌ చేసింది. అయితే ఇన్ని రోజులు మొబైల్, డెస్క్ టాప్ యాప్‍లు మాత్రం నార్మల్‌గానే వర్క్‌ చేశాయి. కేవలం వెబ్‌సైట్‌ మాత్రమే ఆగిపోయింది.. ఇప్పుడు దానిపై కూడా నిషేధాన్ని కేంద్రం ఎత్తేసింది.


Next Story