కోహ్లీ కూతురిపై అసభ్యకర వ్యాఖ్యల కేసు.. నిందితుడికి బెయిల్‌ మంజూరు.!

Virat kohli daughter rape threat case, Accused gets bail. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కుమార్తెపై తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన రాంనగేశ్‌ అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్‌ అయ్యాడు.

By అంజి  Published on  22 Nov 2021 8:35 AM IST
కోహ్లీ కూతురిపై అసభ్యకర వ్యాఖ్యల కేసు.. నిందితుడికి బెయిల్‌ మంజూరు.!

టీ-20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టుపై టీమిండియా ఓటమి తర్వాత భారత ఆట‌గాళ్ల‌పై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కుమార్తెపై తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన రాంనగేశ్‌ అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్‌ అయ్యాడు. తాజాగా అతడికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బాంబేలోని మేజిస్ట్రేట్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను శనివారం నాడు మంజూరు చేసింది.కోహ్లీ, అనుష్క.. మీరు సిగ్గుతో తలదించుకోవాలి.. మీ కూతురు(వామిక) ఫొటోలను ఎప్పుడెప్పుడు చూపిస్తారా.. ఎప్పుడు తనను రేప్ చేస్తానా అని ఎదురు చేస్తున్నా..'అంటూ క్రిక్ క్రేజీ గర్ల్స్ అనే ట్విటర్ అకౌంట్‌ ద్వారా రాంనగేష్‌ కామెంట్లు చేశాడు.

దీంతో ముంబై పశ్చిమ రీజియన్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఈ నెల 9వ తేదీన అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత బాంబేలో బెయిల్‌ కోసం రాంనగేష్‌ కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌ విచారించిన కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. నెల రోజుల పాటు ప్రతి సోమ, గురు వారాల్లో ముంబై వెస్ట్‌ రీజియన్‌ సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో హాజరుకావాలని షరతులు విధించింది. కందిలో ఉన్న హైదరాబాద్‌ ఐఐటీలో రాంనగేశ్‌ ఉన్నత విద్యను అభ్యసించి.. బెంగళూరు కేంద్రంగా పని చేసే ఓ ఫుడ్‌ డెలివరీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లే ప్రయత్నాలో రాంనగేష్‌ ఉన్నాడు. అతడి తల్లిదండ్రులు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు.

మొదట్లో కోహ్లీ కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్య‌లు చేసింది తొలుత పాకిస్థాన్ కు చెందిన వార‌ని ప్ర‌చారం సాగినా.. ఫ్యాక్ట్ చెకర్, ప్రఖ్యాత ఆల్ట్ న్యూస్ కో-ఫౌండరైన మొహ్మద్ జుబేర్ మాత్రం అత‌డిది హైదరాబాదే అని చెప్పారు. క్రిక్ క్రేజీ గర్ల్స్, రమన్ హెయిస్ట్, పెళ్లికూతురుహిరయ్ అనే పేర్లు గల ట్విటర్ అకౌంట్లతో ట్రోలింగ్ కు పాల్పడుతోన్న వ్యక్తి ఒకడేనని.. ఆ మూడు అకౌంట్లకు డేటా యూజర్ ఐడీ ఒకటేనని, ఆ వ్యక్తి హైదరాబాద్ కు చెందిన‌వాడేన‌ని తేల్చేశాడు.

Next Story