వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం.. రైల్వేకు రాజీనామా.. కాసేపట్లో..
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రైల్వేస్ కు రాజీనామా చేసింది. రైల్వేశాఖకు ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటానని ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నారు
By Medi Samrat Published on 6 Sept 2024 2:31 PM ISTభారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రైల్వేస్ కు రాజీనామా చేసింది. రైల్వేశాఖకు ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటానని ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆమె ఈ మధ్యాహ్నం రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్నారు.
భారతీయ రైల్వేకు సేవ చేయడం తన జీవితంలో మరచిపోలేని.. గర్వించదగిన సమయమని వినేష్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. నేను రైల్వే సర్వీస్ నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నాను. భారతీయ రైల్వే అధికారులకు నా రాజీనామా లేఖను సమర్పించాను. దేశానికి సేవ చేయడానికి రైల్వే నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను భారతీయ రైల్వే కుటుంబానికి ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినని పేర్కొన్నారు.
भारतीय रेलवे की सेवा मेरे जीवन का एक यादगार और गौरवपूर्ण समय रहा है।
— Vinesh Phogat (@Phogat_Vinesh) September 6, 2024
जीवन के इस मोड़ पर मैंने स्वयं को रेलवे सेवा से पृथक करने का निर्णय लेते हुए अपना त्यागपत्र भारतीय रेलवे के सक्षम अधिकारियों को सौप दिया है। राष्ट्र की सेवा में रेलवे द्वारा मुझे दिये गये इस अवसर के लिए मैं… pic.twitter.com/HasXLH5vBP
మరికొద్ది సేపట్లో రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. రెజ్లర్లిద్దరూ కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీని కలిశారు. ఆ తర్వాత వారిద్దరూ రాజకీయాల్లోకి వస్తారనే చర్చలు జోరందుకున్నాయి. వినేష్ జులానా, బజరంగ్ పునియా బద్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని భావిస్తున్నారు.
రాహుల్‌తో భేటీ అనంతరం బజరంగ్, వినేష్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కూడా కలిశారు. వినేష్ ఫోగట్ పారిస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా వచ్చారు. ఊరేగింపులో దీపేంద్ర కూడా చాలా దూరం నడిచారు. ఆ సమయంలో బజరంగ్ పునియా కూడా వారితో ఉన్నాడు. అప్పటి నుంచి వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఆ తర్వాత రెజ్లర్లిద్దరూ ఢిల్లీలో భూపేంద్ర సింగ్ హుడాను కూడా కలిశారు.