తమిళనాడులోని కరూర్‌లో శనివారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో పిల్లలతో సహా 31 మంది మరణించగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కారణంగా విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేయవలసి వచ్చింది. అంబులెన్సులు వెళ్లడానికి దారి ఇవ్వాలని విజయ్ కార్యకర్తలను, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ, జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. కరూర్ నుంచి వచ్చిన నివేదిక ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.