డీఎంకే దుష్టశక్తి.. విరుచుకుప‌డ్డ విజ‌య్‌

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో గురువారం జరిగిన భారీ ర్యాలీలో నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ప్రసంగించారు

By -  Medi Samrat
Published on : 18 Dec 2025 2:37 PM IST

డీఎంకే దుష్టశక్తి.. విరుచుకుప‌డ్డ విజ‌య్‌

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో గురువారం జరిగిన భారీ ర్యాలీలో నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ప్రసంగించారు. సెప్టెంబరు 27న కరూర్‌లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగిన తర్వాత ఆయన తొలి బహిరంగ సభ ఇది. ఈ సందర్భంగా ఆయన అధికార డీఎంకేను టార్గెట్ చేస్తూ.. డీఎంకే నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. డీఎంకే దుష్టశక్తి అని, టీవీకే పవిత్రశక్తి అని టీవీకే చీఫ్ విజయ్ అన్నారు. ఈ యుద్ధం పవిత్ర శక్తికి, చెడుకి మధ్య జరుగుతుందన్నారు.

తన ప్రసంగం మొత్తంలో విజయ్ డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించాడు. శాంతిభద్రతల నుంచి నీట్ పరీక్ష నుండి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వడంపై వివాదం వంటి సమస్యలపై ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశాడు. డీఎంకే, సమస్యలు ముడిపడి ఉన్నాయని, వాటిని విడదీయలేమని విజయ్‌ అన్నారు.

విజయ్ ర్యాలీ అన్నాడీఎంకే మాజీ నాయకుడు KA సెంగోట్టయన్ స్వస్థలమైన విజయమంగళం సమీపంలో జరిగింది. అతను ఇటీవల విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగంలో చేరాడు. సెప్టెంబర్‌లో తొక్కిసలాట తర్వాత విజయ్‌కి ఇది రెండో పెద్ద పబ్లిక్ ఈవెంట్ కావడం గమనార్హం. అంతకుముందు విజయ్ పొదుచ్చేరిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికార డీఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా, పశ్చిమ ప్రాంతాలు ఎక్కువగా ద్రావిడ కోటలుగా పరిగణిస్తారు. ఆ వారసత్వాన్ని క్లెయిమ్ చేయడం ద్వారా విజయ్ తమిళ ఓటర్ల దృష్టిలో తన సామాజిక-రాజకీయ గుర్తింపును స్థాపించాలనుకుంటున్నాడు. ఈరోడ్ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఈరోడ్ (తూర్పు), పశ్చిమం, అంతియూర్ ఉన్నాయి. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం డీఎంకే ఆధీనంలో ఉన్నాయి. నాలుగు సీట్లు అన్నాడీఎంకే, ఒక సీటు బీజేపీకి దక్కాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కి చెందిన టీవీకే పోటీ చేయనుంది.

Next Story