విజయ్‌ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా

Vijay mallya gets 4 months jail in contempt of court case. కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు

By అంజి  Published on  11 July 2022 7:00 AM GMT
విజయ్‌ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా

కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు 4 నెలలు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. 2017లో క‌ర్ణాట‌క హైకోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించి విదేశాల్లో ఉన్న త‌న కొడుకు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాల‌కు 40 మిలియ‌న్ డాల‌ర్లను ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి విజయ్‌ మాల్యా బ‌దిలీ చేశారు. డబ్బులు బదిలీ చేసిన విషయాన్ని కోర్టుకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. దీంతో మల్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

పలుమార్లు విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా విచారణకు మల్యా హాజరుకాలేదు. రూల్స్‌కు విరుద్ధంగా డబ్బులు బ‌దిలీ చేశార‌ని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లోగా వ‌డ్డీతో స‌హా న‌గ‌దు డిపాజిట్ చేయాల‌ని మాల్యాను ఆదేశించింది. డిపాజిట్‌ చేయ‌కుంటే ఆస్తుల‌ను స్వాధీనం చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మాల్యా ప్రస్తుతం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకు లోన్‌ ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్నాడు.


Next Story