యోగి ఆదిత్యనాథ్ పై పోటీ చేస్తానన్నాడు.. అరెస్టు అయ్యాడు..!

Video Shows Dramatic Arrest Of UP Ex-Cop Who Challenged Yogi Adityanath. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం

By M.S.R  Published on  28 Aug 2021 1:47 PM IST
యోగి ఆదిత్యనాథ్ పై పోటీ చేస్తానన్నాడు.. అరెస్టు అయ్యాడు..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌పై పోటీ చేస్తాన‌ని మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ అమితాబ్ ఠాకూర్ ఇటీవలే ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై అమితాబ్ ఠాకూర్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్పీ ఎంపీ అతుల్‌రాయ్ త‌న‌పై అత్యాచారం చేశాడంటూ త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఈ నెల 16న 24 ఏండ్ల యువ‌తి త‌న స్నేహితుడితో క‌లిసి సుప్రీంకోర్టు గేటు ఎదుట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. అంత‌కు ముందు ఆమె మాట్లాడుతూ ఎంపీ అతుల్ రాయ్‌కు సాయం చేసేలా కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. 24వ తేదీన ఆమె ఢిల్లీలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.

అయితే ఈ కేసులోనే అమితాబ్ ఠాకూర్‌ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. అమితాబ్ ఠాకూర్ త‌న‌ విధుల ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేయ‌డం లేద‌ని ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయ‌న‌ను తొల‌గించింది. తాను 2022 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యోగిపై పోటీ చేస్తాన‌ని, త్వ‌ర‌లోనే పార్టీని ప్రారంభించ‌బోతున్న‌ట్లు అమితాబ్ ఠాకూర్ తెలిపారు.

పది రోజుల క్రితం యూపీకి చెందిన యువతీ యువకులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. సమీపంలోనే ఉన్న పోలీసులు మంటలు ఆర్పి వారిని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బాధితులిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు గల కారణాలు వివరించారు. 24 ఏళ్ల బాధిత యువతి మాట్లాడుతూ.. అత్యాచార బాధితురాలినైన తనను యూపీ పోలీసులు చరిత్ర హీనురాలిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ నేతలు, పోలీసులు కుమ్మక్కై తనను వేధిస్తున్నారని వాపోయింది. వారి వేధింపులు తాళలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. నేర చరిత కలిగిన వ్యక్తి అయిన ఓ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆమె.. ఎస్పీ, పోలీసులు, రాజకీయ నేతలు, ప్రయాగ్‌రాజ్ కోర్టు న్యాయమూర్తి కలిసి తనను వేధిస్తున్నారని ఆరోపించింది.



Next Story