చైన్ స్నాచర్‌ను పట్టుకున్న కానిస్టేబుల్.. వీడియో వైరల్
Video Shows Brave Delhi Cop Catching Chain Snatcher. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో ఓ దొంగను పట్టుకున్నాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Nov 2022 8:30 PM ISTఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో ఓ దొంగను పట్టుకున్నాడు. పారిపోతున్న చైన్ స్నాచర్‌ను పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టుబడ్డ నిందితుడి నుండి సేకరించిన సమాచారం ఆధారంగా పెండింగ్‌లో ఉన్న 11 కేసులలో కీలకమైన వివరాలు పొందామని ఢిల్లీ పోలీసులు ట్వీట్‌లో పేర్కొన్నారు. కానిస్టేబుల్ సాహసోపేతమైన చర్య.. ఒక మహిళ తన నెక్లెస్ చోరీకి గురికాకుండా అడ్డుకుంది.
షాహాబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్ పోలీసులకు స్నాచింగ్ గురించి ఫిర్యాదు చేసింది. దొంగ ఆచూకీ కోసం కానిస్టేబుల్ సత్యేంద్ర సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసుల అధికారిక ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేసింది.
अपनी जान की परवाह किए बगैर शाहबाद डेरी थाने के कांस्टेबल सत्येंद्र ने एक स्नैचर को गिरफ्तार किया।
— Delhi Police (@DelhiPolice) November 24, 2022
इस स्नैचर की गिरफ्तारी से 11 मामले सुलझाए गए।
विधिक कार्यवाही जारी है।@dcp_outernorth#HeroesOfDelhiPolice pic.twitter.com/PceBbYpdYQ
"ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నా, షహబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సత్యేంద్ర ఒక స్నాచర్‌ను అడ్డుకున్నారు. ఈ స్నాచర్ అరెస్టుతో, 11 కేసులు పరిష్కరించాము. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి." అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ యువకుడు బైక్ లో వెళ్తూ ఉండగా.. పోలీసు ఎదురుగా వచ్చాడు. అక్కడి నుండి తప్పించుకోవాలని దొంగ బైక్ నుండి దూకేశాడు.. వెంటనే పోలీసు కూడా గట్టిగా అతడిని పట్టుకోడానికి బైక్ మీద నుండి దూకేయడాన్ని వీడియోలో మనం చూడవచ్చు. వెంటనే మిగిలిన పోలీసు బృందం కూడా అక్కడికి వచ్చి సదరు దొంగను పట్టేసుకుంది. పోలీసు ధైర్యసాహసాలను నెటిజన్లు మెచ్చుకుంటూ ఉన్నారు.