బీజేపీ సీనియ‌ర్ నేత‌, పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్ క‌న్నుమూత‌

Veteran BJP leader Keshari Nath Tripathi passes away at 89.పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2023 9:37 AM IST
బీజేపీ సీనియ‌ర్ నేత‌, పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్ క‌న్నుమూత‌

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి (89) కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో ఉన్న త‌న నివాసంలో చికిత్స పొందుతున్నాడు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ రోజు ఉద‌యం 5 గంట‌ల స‌మ‌యంలో తుదిశ్వాస విడిచారు. కేశరినాథ్ త్రిపాఠి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం 4:00 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లోని రసూలాబాద్ ఘాట్‌లో నిర్వహించనున్న‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు.

1934 న‌వంబ‌ర్ 10న కేశరినాథ్ త్రిపాఠి జ‌న్మించారు. ఆయ‌న మూడు ప‌ర్యాయాలు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి స్పీకర్‌గా పనిచేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయా ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేశారు.

బీజేపీ అగ్రనేత మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. 'సీనియర్ రాజకీయ నాయకుడు, బీజేపీ కుటుంబానికి చెందిన సీనియర్ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి మృతి చెందడం చాలా బాధాకరం' అని యోగి ట్వీట్ చేశారు. ఆయ‌న ఆత్మ‌ భ‌గ‌వాన్ శ్రీరాముడి స‌న్నిధికి చేరాల‌ని ఆకాంక్షించారు. ఈ దుఃఖాన్ని భరించే శక్తిని కేశరినాథ్ త్రిపాఠి కుటుంబ సభ్యులకు అందించాల‌ని భ‌గ‌వంతుడిని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.


Next Story