ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. భరతనాట్యం, కూచిపూడి నృత్యరీతుల్లో యామినీ కృష్ణమూర్తి ఎంతో పేరును గడించారు. ఆమెను ఒక ఐకాన్ లా భావిస్తారు.1940లో మదనపల్లెలో జన్మించారు. ప్రఖ్యాత నృత్యకారిణి, గురువు రుక్మిణీ దేవి అరుండేల్ వద్ద శిష్యరికం చేశారు. 1957లో చెన్నైలో తన మొదటి నాట్య ప్రదర్శన ఇచ్చారు. 1968లో పద్మశ్రీ, 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2016లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. యామినీ కృష్ణమూర్తి టీటీడీ ఆస్థాన నాట్యకళాకారిణిగానూ సేవలు అందించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.