అమెరికాలో తన కుమారుడు అగ్నివేష్ ఆకస్మిక మరణం తర్వాత, బిలియనీర్ పారిశ్రామికవేత్త, వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తన సంపదలో 75% కంటే ఎక్కువ సమాజానికి విరాళంగా ఇస్తానని మరోసారి తెలిపారు. తన జీవితంలో "చీకటి రోజు" అని అభివర్ణించిన అగర్వాల్, స్కీయింగ్ ప్రమాదంలో తగిలిన గాయాల నుండి కోలుకుంటున్నప్పుడు తన 49 ఏళ్ల కుమారుడు ఆకస్మిక గుండెపోటుతో మరణించాడని అన్నారు. అగ్నివేష్ న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా, అతను కోలుకుంటాడని అతడి కుటుంబం విశ్వసించింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ (49) అమెరికాలో అకాల మరణం చెందారు. అమెరికాలో స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన అగ్నివేశ్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. కుమారుడి మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన అనిల్ అగర్వాల్, 'ఎక్స్' వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. "నా కొడుకు అగ్ని మమ్మల్ని ఇంత త్వరగా విడిచి వెళ్ళిపోయాడు. నా స్నేహితుడిలా ఉండేవాడు. మా సంపాదనలో 75 శాతం సమాజానికి ఇస్తానని వాగ్దానం చేశాను. ఆ మాటను ఈరోజు మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను." అని ఆయన అన్నారు. మరణించిన అగ్నివేశ్, వేదాంత అనుబంధ సంస్థ తల్వండి సోబో పవర్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. సుమారు రూ. 27,000 కోట్ల సంపద కలిగిన అనిల్ అగర్వాల్‌కు అగ్నివేశ్‌తో పాటు కుమార్తె ప్రియా అగర్వాల్ కూడా ఉన్నారు.