పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచిన ప్ర‌భుత్వం

పంజాబ్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచారు. పెట్రోల్‌పై 61 పైసలు, డీజిల్‌పై 92 పైసలు వ్యాట్ పెరిగింది.

By Medi Samrat  Published on  5 Sept 2024 3:50 PM IST
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచిన ప్ర‌భుత్వం

పంజాబ్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచారు. పెట్రోల్‌పై 61 పైసలు, డీజిల్‌పై 92 పైసలు వ్యాట్ పెరిగింది. పంజాబ్ కేబినెట్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాట్‌ను పెంచడం వల్ల డీజిల్‌పై రూ.395 కోట్లు, పెట్రోల్‌పై రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని చీమా తెలిపారు. హిమాచల్, రాజస్థాన్, హర్యానా కంటే పంజాబ్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తక్కువగా ఉందని కూడా ఆయన చెప్పారు.

ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఫార్మింగ్ పాలసీపై చర్చించామని చీమ తెలిపారు. ఈ విధానంలో భూగర్భ జలాల మట్టంపై చర్చ జరిగిందని తెలిపారు. పంజాబ్‌లోనూ విద్యా విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్రంలో నైపుణ్యం, సాంకేతిక ఆధారిత విద్యా విధానం తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. విద్యా నిపుణుల సహకారంతో పాలసీని రూపొందించనున్నట్లు తెలిపారు. స్కూల్ ఆఫ్ ఎమినెన్స్‌లో ప్రవేశానికి రెండు లక్షల మంది పిల్లలు నమోదు చేసుకున్నారని వెల్ల‌డించారు.

ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ విధానంపై చర్చించేందుకు సీఎం భ‌గ‌వంత్ మాన్ రైతులను హాజ‌రు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. దీనిపై రైతులు కూడా తమ పక్షం వహిస్తారని.. రైతు సంఘాల సహకారంతో పాలసీని జారీ చేయనున్నట్లు తెలిపారు.

Next Story