ఆ ఫుడ్ లో ఫంగస్.. ఎలా తినాలంటూ గగ్గోలు..!

డెహ్రాడూన్‌ నుంచి ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌కు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి రైలులో ఇచ్చిన భోజనంలో ఫంగస్ కనిపించింది.

By Medi Samrat  Published on  5 March 2024 3:00 PM GMT
ఆ ఫుడ్ లో ఫంగస్.. ఎలా తినాలంటూ గగ్గోలు..!

డెహ్రాడూన్‌ నుంచి ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌కు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి రైలులో ఇచ్చిన భోజనంలో ఫంగస్ కనిపించింది. భోజనంలో భాగంగా వడ్డించిన పెరుగులో ఫంగస్‌ ఉందని గుర్తించి సదరు ప్రయాణీకుడు షాక్‌కు గురయ్యాడు. హర్షద్ తోప్కర్ అనే X వినియోగదారు.. రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ఖాతాలను ట్యాగ్ చేస్తూ తనకు ఎదురైన అనుభవం గురించి ఫిర్యాదు చేశారు. హర్షద్ ఫిర్యాదు చేసిన వెంటనే, అతని పోస్ట్‌పై భారతీయ రైల్వే స్పందించింది.

తన పోస్ట్‌లో, హర్షద్ వందే భారత్ ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో తన ప్రయాణంలో వడ్డించిన భోజన చిత్రాలను కూడా పంచుకున్నాడు. పెరుగు ఫంగస్‌తో కలుషితమైందని అతని పోస్ట్‌తో పాటు ఉన్న చిత్రాల ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉంది. “ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో డెహ్రాడూన్ నుండి ఆనంద్ విహార్ వరకు వందే భారత్‌లో ప్రయాణిస్తున్నాను. పెరుగులో ఆకుపచ్చని పొర ఫంగస్‌ అని మనకు తెలుస్తోంది. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు ”అని హర్షద్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రైల్వే సేవా.. హర్షద్‌ను అతని ప్రయాణ వివరాలను తెలియజేయాలని కోరింది. వారు ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.

Next Story