గుజరాత్‌లోని వడోదరలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా, 17 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వాఘెడియా క్రాసింగ్ వద్ద రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు కూడా నుజ్జు నుజ్జు అయ్యాయి.

కాగా, ఈ ఘటన ప్రధాని నరేంద్రమోదీని తీవ్రంగా కలచివేసింది. ఒకేసారి ఇంత మంది మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని మోదీ అధికారులకు సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అన్ని విధాలుగా సహయక చర్యలు చేపట్టండి అని అన్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సమచారం అందుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సుభాష్

.

Next Story